![]() |
| Perfect Partner |
సాధారణంగా అబ్బాయి తన లైఫ్ పార్టనర్ గురించి అనేకరకాలుగా ఆలోచిస్తారు. తన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి. ఎలా ఉంటే బాగుంటుంది. ఆమె తన జీవితంలోకి వచ్చాక తనతో ఎలా ఉంటుంది..తనకు సెట్ అవుతుందా లేదా అని రకరకాల ప్రశ్నలు తనలో తానే వేసుకుని ఆలోచించుకుంటాడు. ఎలాంటి అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడతారన్న అంశంపై ఇటీవలే ఓ సంస్థ సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయి అందమైన చందమామలా ఉంటే అబ్బాయిలకు ఇష్టం. అందంగా ఉండే అమ్మాయి దొరికితే.. ఆ అబ్బాయి ఆనందానికి హద్దులు ఉండవట. అందంతో పాటు అణుకువ…అత్తింట్లో అందరితోను కలిసి మెలిసి ఉండాలట. అలాగే వంట చాలా నీట్‌గా చేసే అమ్మాయిలను కూడా అబ్బాయిలు బాగా ఇష్టపడతారట. మరికొందరు అబ్బాయిలు ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఎక్కువగా చూస్తుంటారు. అమ్మాయికి అక్కచెల్లెళ్ళు ఎంతమంది ఉన్నా పెద్దగా పట్టించుకోరు.. అదే అన్నదమ్ములు ఎక్కువగా ఉంటే ఉంటే మాత్రం అటువంటి కుటుంబంలో నుంచి అమ్మాయిని చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపరట. ఇక అమ్మాయి అబ్బాయి కంటే నాలుగు ఇంచెలు హైట్ తక్కువగా ఉండాలట. అలా అయితేనే మగపిల్లలకు ఆడపిల్లలు నచ్చుతారట. అయితే అందరు అమ్మాయిలలోను పైన చెప్పిన క్వాలిటీస్ అన్ని ఉండకపోయినా చాలా మంది మాత్రం పై లక్షణాల్లో చాలా ఉన్న అమ్మాయిలనే ఇష్టపడతారని ఆ సర్వేలో వెల్లడయ్యాయి.

No comments:
Post a Comment