Ad1

Thursday, October 29, 2015

Check Out What Your Sleeping Position Say About Your Relationship

1.To spoon or not to spoon: The way we sleep with our partner can be telling of the state of our relationships, according to experts

Check Out What Your Sleeping Position


2.Growing apart, together: Some positions, such as spooning, may start out snug and intimate in early relationships, and loosen as the relationship matures

Check Out What Your Sleeping Position


3.'The chase': This position could mean that one partner is playing hard to get or wants to be pursued

Check Out What Your Sleeping Position


4.Love knots: Sleeping in a tangled up position is said to be associated with new relationships, but may not be a good practice in the long run as it could lead to dependency

Check Out What Your Sleeping Position


5.Loosening up: If a couple sleeps tangled but then drifts apart, it is a sign of a maturing relationship

Check Out What Your Sleeping Position


6.A good sign: Couples who sleep facing apart are among a large - 27 per cent - of couples, and is a sign of a secure and connected couple

Check Out What Your Sleeping Position


7.Back kissing: Those who face apart but still touch during the night are also prevalent with one in four couples admitting to sleeping this way

Check Out What Your Sleeping Position


8.Giving a nuzzle: The position where one partner sleeps on the other's chest is one of the rarer practices, with only four per cent of couples using it, but experts say it 'represents vibrant, passionate or rekindled love'

Check Out What Your Sleeping Position


9.Sign of trouble: A space hogging partner may be a selfish one in other parts of his or her life

Check Out What Your Sleeping Position


Friday, October 23, 2015

అజరామరం అమరావతి

History of Amaravati

అమరావతి ఆగ్నేయ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ నందు ఉన్న ఒక పట్టణము, ఇది గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్నది. ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది. ఈ పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటకము ప్రసిద్ధిచెందినది.చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణము లో వసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు.

చరిత్ర
అమరావతిలో కల అమరేశ్వర ఆలయం కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రాయన గ్రంథంలో పొందుపరచబడి వున్నాయి. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.

అమరేశ్వరాలయం
గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం. ప్రతి యేటా విజయదశమి రోజున . మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి . అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు . జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు ,కుమార స్వామి , ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్టితమై ఉన్నాడు.

History of Amaravati


అమరారామం
అమరలింగేశ్వరస్వామి దేవాలయ గోపురము అమరలింగేశ్వర స్వామి (శివుడు) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు వున్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందుతున్నాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించినట్టుగా ఇందులో రాసి ఉంది.
స్థలపురాణం
త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించి . అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్టించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

బౌద్ధ సంస్కృతి
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. తావ్వకాల తరువాత పాలరాతి మీద చెక్కబడిన ప్రధాన్యత లేని కొన్ని శిల్పాలు నిర్లక్ష్యంగా వదిలి వేయబడ్డాయి. ప్రజలు ఈ పాలరాతి ముక్కలను తమ ఇండ్లకు తీసుకువెళ్ళి మెత్తని పొడిచేసి రంగోలీలో వాడుకున్నారు. తరువాత ఒక పలుచని కంచెతో సురక్షితం చేసినా ప్రజలు సులువుగా లోపల ప్రవేశించి స్థాపం సమీపంలో సంచరించారు. ఇందులో ఐదు పీరియడ్స్ కి సంబంధించిన నివాసుల అధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.
అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.

వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు
History of Amaravati
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి సంస్థాన పాలకుడు. 1761 ఏప్రిల్ 20న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పాలనా కాలంలో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. ఈ సంఘటనను "అటునుంచి కొట్టుకురండి" అన్న కథలో (అమరావతి కథలు)చక్కగా వివరించబడినది. ఈ సంఘటన జరిగిన గ్రామం పేరు నరుకుళ్ళపాడు గా మారింది. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనై, పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. అమరావతి లోని అమరలింగేశ్వరస్వామి గుడిని పునరుద్ధరించాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేట గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు.

బాలకృష్ణ డిక్టేటర్ ట్రైలర్ విడుదల… హ్యండ్ సమ్ లుక్ లో బాలయ్య.

శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం డిక్టేటర్. ఈ సినిమాకు సంబంధించిన  ట్రైలర్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో బాలకృష్ణ మస్త్ హ్యాండ్ సమ్ లుక్ లో కనిపించారు. ట్రైలర్ టేకింగ్ కూడా  రిచ్ గా కనిపించింది. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణ వదిలిన డైలాగ్స్ మాత్రం కేకపుట్టిస్తున్నాయ్.


  • నీ హిస్టరీలో బ్లడ్ ఉండొచ్చు, కానీ నా బ్లడ్ కే ఓ హిస్టరీ ఉంది.
  • మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటోడిని రెచ్చగొట్టడం  జీవితానికే ప్రమాదం. 
 ఈ రెండు డైలాగ్స్ ఫుల్ పవర్ ఫుల్ గా పేల్చాడు బాలయ్య బాబు.

Watch HD Trailer : CLICK HERE

Wednesday, October 21, 2015

దసరా అంటే పది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది..ఆ 1O గుణాలు ఏంటో తెలుసా?

Dussehra
దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేది ఈ “దశహర” పండుగ.

  • కామ (Lust)
  • క్రోధ (Anger)
  • మోహ (Attachment)
  • లోభ (Greed)
  • మద (Over Pride)
  • మాత్సర్య (Jealousy)
  • స్వార్థ (Selfishness)
  • అన్యాయ (Injustice)
  • అమానవత్వ (Cruelty)
  • అహంకార (Ego)

ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని “విజయదశమి” అనికూడా అంటారు. 
దసరా పండుగ ఇతివృత్తం:
బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో  ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినం. .

అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

ఎన్టీఆర్ " నాన్నకు ప్రేమతో " ట్రైలర్ వచ్చేసింది...



Tuesday, October 20, 2015

అలా అయితేనే మగపిల్లలకు ఆడపిల్లలు నచ్చుతారట

Perfect Partner
సాధారణంగా అబ్బాయి తన లైఫ్ పార్టనర్ గురించి అనేకరకాలుగా ఆలోచిస్తారు. తన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి. ఎలా ఉంటే బాగుంటుంది. ఆమె త‌న జీవితంలోకి వ‌చ్చాక త‌న‌తో ఎలా ఉంటుంది..త‌న‌కు సెట్ అవుతుందా లేదా అని ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు త‌న‌లో తానే వేసుకుని ఆలోచించుకుంటాడు. ఎలాంటి అమ్మాయిల‌ను అబ్బాయిలు ఇష్ట‌ప‌డ‌తార‌న్న అంశంపై ఇటీవలే ఓ సంస్థ సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయి అందమైన చంద‌మామలా ఉంటే అబ్బాయిల‌కు ఇష్టం. అందంగా ఉండే అమ్మాయి దొరికితే.. ఆ అబ్బాయి ఆనందానికి హద్దులు ఉండవట. అందంతో పాటు అణుకువ‌…అత్తింట్లో అంద‌రితోను క‌లిసి మెలిసి ఉండాల‌ట‌. అలాగే వంట చాలా నీట్‌గా చేసే అమ్మాయిల‌ను కూడా అబ్బాయిలు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. మ‌రికొంద‌రు అబ్బాయిలు ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఎక్కువగా చూస్తుంటారు. అమ్మాయికి అక్కచెల్లెళ్ళు ఎంతమంది ఉన్నా పెద్దగా పట్టించుకోరు.. అదే అన్నదమ్ములు ఎక్కువగా ఉంటే ఉంటే మాత్రం అటువంటి కుటుంబంలో నుంచి అమ్మాయిని చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూప‌రట. ఇక‌ అమ్మాయి అబ్బాయి కంటే నాలుగు ఇంచెలు హైట్ తక్కువగా ఉండాలట. అలా అయితేనే మగపిల్లలకు ఆడపిల్లలు నచ్చుతారట. అయితే అంద‌రు అమ్మాయిల‌లోను పైన చెప్పిన క్వాలిటీస్ అన్ని ఉండక‌పోయినా చాలా మంది మాత్రం పై ల‌క్ష‌ణాల్లో చాలా ఉన్న అమ్మాయిల‌నే ఇష్ట‌ప‌డ‌తార‌ని ఆ స‌ర్వేలో వెల్ల‌డ‌య్యాయి.

నూతన రాజధాని అమరావతి చరిత్ర & గొప్పదనం వీడియో రూపంలో….

దసరా నాడు  అంగరంగ వైభవంగా  శంకుస్థాపన జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  గిన్నిస్ బుక్ లోకి ఎక్కునుందని ప్రచారం జరుగుతోంది. గిన్నిస్ బుక్ మాట ఎలా ఉన్నా..కలల రాజధానిని  నిర్మించుకునే క్రమంలో ప్రతి ఒక్కరి కల సాకారం కాబోతుంది అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో   అమరావతి  యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చారిత్రాత్మకంగా  అమరావతికి ఉన్న ప్రాశస్తి ని కూడా ఈ సంధర్భంగా గుర్తు చేసుకోవాలి.  చరిత్రను సజీవంగా అర్ధం చేసుకోడానికి ఈ వీడియో కొంతైనా సహకరిస్తుందనుకుంటున్నాను.




తేనె వల్ల ప్రయోజనాలు

Health Tips
గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని పరగడుపున తాగితే శరీరంలోని మలినాలన్నీ వెలివేస్తాయి. ఇలా చేయడం వల్ల గుండెకు లాభం చేకూరుతుంది. గుండె ఆరోగ్యముగా, పటిష్టంగా ఉంచడంలో తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇకనుంచైనా తేనె కలిపిన నిమ్మరసాన్ని రోజు తప్పనిసరిగా తాగడం అలవాటు చేసుకోండి. అలాగే వారంలో కనీసం రెండు, మూడు సార్లు అయిన హెర్బల్ "టీ" తాగాలి. ఎందుకంటే.. ఈ "టీ" లో కేఫినే ఉండదు కాబట్టి గుండెకు మేలు చేస్తుంది.
గుండెను పదిలం చేసుకోవాలంటే ద్రాక్షను తీసుకోండి. వీటిలో పాలీఫేనాల్స్ గుండెను రక్షిస్తుంది. అందులోనూ నల్ల ద్రాక్షలను తీసుకోవడం ద్వారా గుండెకు మేలు చేసినట్లవుతారు. ఇక యాలకుల పొడి వేసిన "టీ" తాగినా గుండె దడ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే గుండె చుట్టూ కొవ్వు చేరకుండా నివారించడంలో వెల్లుల్లి భాగా పనిచేస్తుంది. అందుకే రోజు అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడిని తప్పనిసరిగా తీసుకోవాలి. 
దీన్ని ఇష్టపడని వారు ఆహరంలో వెల్లుల్లి చేర్చుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తేనె కంటికి అవసరమైన విటమిన్ శరీరం తీసుకునేందుకు సాయపడుతుంది. ఇది శరీరపు శక్తిని ఇనుమడింపజేస్తుంది. మానసిక ప్రశాంతతని, సహజమైన నిద్రని ఇస్తుంది. తేనె నీళ్ళు పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ళవాపు తగ్గుతాయి.
ప్రయోజనాలు:
* రోజూ పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెమ్చాల తేనె కలుపుకుని తాగితే ఒళ్ళు తగ్గుతుంది.
* నిమ్మకాయరసంతో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది.
* వేడి టీలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకొని తాగితే ఆయాసం తగ్గుతుంది.
*ఎదిగే పిల్లలకు పాలు, ఎదిగిన పిల్లలకు నెయ్యి, ఎదిగి జీవించవలసిన మధ్య వయస్కులకు తేనె సహజమైన జీవరసాయనాలను అందిస్తుంది.
*తేనె, తులసి ఆకురసం కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గిపోతుంది.
*రెండు చెమ్చాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపుకాంతి పెరుగుతుంది.

హరిహరసుతుడు అయ్యప్పస్వామి !

Traditional Information
కలియుగంలో మనిష్యులను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్పస్వామి.

అయ్యప్పస్వామి కరుణాకటాక్షాలకోసం దీక్ష పూని, ఓ మండలంరోజుల పాటు ఆ దీక్షను కొనసాగించి,తర్వాత ఇంట్లో పూజచేసి, అఖండదీపాన్ని వెలిగించి, ఆత్మదీప దర్శనం కోసం ఇరుముడిని ధరించి శబరిమలయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది అయ్యప్ప స్వామికి మండలదీక్ష (48 రోజులదీక్ష) ఎందుకు? ఒకరోజు, ఐదురోజుల దీక్ష కూడ చేయవచ్చుగా అని అడుగుతున్నారు. అడగడమే కాదు, ఆ పద్దతుల్లో దీక్షలు చేపట్టి జ్యోతి దర్శనానికి బయలుదేరుతారు. ఆ వాదప్రతివాదనలను అలా వుంచితే, మండలదీక్షలో ఓ గూఢార్థం ఉంది. మనిషి పుడుతున్నప్పుడు, అప్పుడున్న నక్షత్రస్థితి, రాశిస్వభావం, ఇంకా అప్పటి గ్రహస్థితులు, ఆ మనిషి భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృష్టితో చూసినప్పుడు

నక్షత్రాలు - 27
రాశులు - 12
గ్రహాలు - 09
మొత్తం - 48

వీటి ప్రభావం నుంచి తప్పుకుని, భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారమనే జ్యోతి దర్శనానికే 48 రోజుల దీక్ష చేస్తున్నాం. ఇదే మండలదీక్షలోని అంతరార్థం. అందుకే మండలకాలంపాటు దీక్ష...ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప .